APకి జరిగిన నష్టం రూ.6,800 కోట్లు
NEWS Sep 07,2024 02:44 pm
ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32 మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.6,800 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.2,164.5 కోట్లు, జలవనరుల శాఖకు సంబంధించి 1,568.6 కోట్లు, మున్సిపల్ శాఖకు 1,160 కోట్లు, మిగిలినవి ఇతర శాఖలకు నష్టం జరిగినట్టు ప్రాథమిక నివేదిక రూపొందించిన ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది.