ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
NEWS Sep 07,2024 02:39 pm
వినాయక చవితి వేడుకలను ఐకమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ లో నిర్వహించిన సమావేశంలో వినాయకుని మండపాల ఏర్పాట్లు, నిమజ్జనం సమయంలో ఊరేగింపుగా వెళ్లే రూట్లు, కాలనీలు, నిమజ్జన చేసే ప్రాంతాలపై సిబ్బంది నిర్వహించే విధులను గూర్చి వివరించారు. మసీదుల వద్ద ముస్లిం మత పెద్దలతో పాటు హిందువు మత పెద్దలతో ఎప్పటికప్పుడు మాట్లాడి పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.