రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
NEWS Sep 07,2024 02:58 pm
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నమూనాలను పరిశీలించి, ఆలయ అభివృద్ది పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ అధికారులతో కలిసి శనివారం ఆలయ ఈఓ గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఈ రఘునందన్, ఏఈఓ బ్రహ్మన్న శ్రీనివాస్, జి రమేష్ బాబు, ఇంచార్జ్ స్థానాచార్య, ఉమేష్, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.