విఘ్నాలను తొలగించాలని వినాయకుడిని ప్రార్థించానని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. సఖినేటిపల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన వినాయక చవితి వేడుకల్లో గొల్లపల్లి పాల్గొన్నారు. వినాయకునికి పూజలు నిర్వహించారు. సఖినేటిపల్లి మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.