అయినవిల్లిలో ఆకట్టుకుంటున్న సెట్టింగ్
NEWS Sep 07,2024 02:52 pm
వినాయక చవితిని పురస్కరించుకుని 5 ప్రతిమలతో ఏర్పాటు చేసిన సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయినవిల్లి శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. చేతులతో హార్మోనియం ప్లే చేస్తూ, నాదస్వరం ఊదుతూ, సన్నాయి వాయిద్యాలు వాయిస్తున్న విధంగా ఐదుగురు వినాయకులతో ఈ భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల వెలుగులలో ఈ అద్భుత దృశ్యం భక్తులను మైమరపిస్తోంది.