గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు
ఒడిస్సా పోలీసులు సహకరించాలి: సిఐ
NEWS Sep 07,2024 02:55 pm
అరకు: గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో అరకు సిఐ హిమగిరి, ఎస్ఐ ఆర్ సంతోష్ లు ఆంధ్ర బోర్డర్ లోని ఒడిస్సా రాష్ట్రంకు చెందిన పాడువా పోలీసు స్టేషన్ ను సందర్శించారు. ఈ మేరకు వారు పాడూవా పోలీసు స్టేషన్ SHOతో మాట్లాడుతూ.. ఆంద్రా-ఒడిస్సా సరిహద్దులోని ఒడిస్సా గ్రామాల నుండి ఆంధ్రా బోర్డర్ రహదారుల ద్వారా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు తగిన సమాచారం అందించి సహకరించాలని కోరారు.