అనంతపురం: గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం సమీపంలో రైల్వే అధికారుల ఆధ్వర్యంలో నెమలి ఈకల వినాయకుడిని శనివారం ప్రతిష్టించారు. ప్రతి ఏడాది పర్యావరణానికి మేలు చేసే వెరైటీ వినాయకుడిని ప్రతిష్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గత ఏడాది నవధాన్యాలతో వినాయకుడు ప్రతిష్టించామని, ఈ ఏడాది నెమలి ఈకలతో వినాయకుడిని ప్రతిష్టించామన్నారు.