అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఇండ్లు
NEWS Sep 07,2024 01:33 pm
హైదరాబాద్‌లో మరోసారి రాజీవ్ స్వగృహ ఇండ్లను విక్రయించాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ ఇళ్ల ద్వారా అమ్మకం ద్వారా 3 వేల కోట్లు పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నాగోలో, పోచారం, గాజులరామారం, జవహర్ నగర్, ఖమ్మం, వికారాబాద్, ఇతర ప్రాంతాల్లోని ఫ్లాట్స్‌ను, టవర్లను, ప్లాట్స్‌ను విక్రయించడానికి రెడీ అవుతోంది. పోచారం, బండ్లగూడ వద్ద దాదాపు 760 ఫ్లాట్స్ అందుబాటులో ఉండనున్నాయి. 3 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఉండనున్నాయి. బండ్లగూడలో 159, సోచారంలో 601 ఫ్లాట్స్ ఉండొచ్చు. ఇంకా చందానగర్, కుందనపల్లి, కవాడిపల్లి, కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి, గాజులరామారం, గద్వాల్, అల్లాపూర్, కోకట్ వంటి ఏరియాల్లో కూడా ప్లాట్స్ కొనుగోలుకు అందుబాటులో ఉండొచ్చు. త్వరలోనే పూర్తి వివరాలు, ధర వంటి అంశాలు వెల్లడి కానున్నాయి.