గణనాథుడి ఆశీస్సులు జనులందరి పై ఉండాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన గణేష్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక నాళం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ లక్ష్మీ సిద్ది గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు.