ధర్మవరం పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయదారులను అరెస్టు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా నరసింహులు అనే వ్యక్తి వద్ద ఉన్న 48 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి వాటిని జప్తు చేసుకొని ఆయన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.