AP పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
NEWS Sep 07,2024 01:20 pm
కోస్తా జిల్లాలకు మరో 2-3 రోజుల వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి తోడైంది. దీంతో ఏలూరు జిల్లా, అల్లూరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉభయగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల భారీ అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయని ప్రకటించారు. ఆదివారం కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతిపురం, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.