అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. యానాం నుంచి అమలాపురం వైపు వెళ్తున్న బొలెరో వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతో పక్కనున్న పంట బోదెలో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు క్షతగాత్రులను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌ను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.