వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
NEWS Sep 07,2024 01:05 pm
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్రహం వద్ద జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్, పోలీస్ అధికారులతో కలిసి పూజా కార్యక్రమలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని గణపతిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు తెలిపారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.