సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం చాల్కి - చీకూర్తి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వరద ఉధృతి లో కొట్టుకుపోయి యువకుడు మృతి చెందాడు. న్యాల్ కల్ మండల అమీరాబాద్ గ్రామానికి చెందిన రవీందర్ (32) ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. కాజ్ వే మీదుగా వెళుతున్న నీటి ఉధృతి గుర్తించకపోవడంతో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయి మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.