గణేష్ నవరాత్రి ఉత్సవాల పోస్టర్
ఆవిష్కరించిన ప్రభుత్వ విప్
NEWS Sep 07,2024 01:00 pm
రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం (మహాసభ) వేములవాడ వారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 47 వ వార్షికోత్సన్ని పునస్కరించుకొని నిర్వహించబోయే వినాయక ఉత్సవ కార్యక్రమల పోస్టర్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.