వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన
గుంతకల్లు ఎమ్మెల్యే
NEWS Sep 07,2024 11:42 am
గుంతకల్లు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో విఘ్నలు తొలగిపోయి, సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుడికి కరుణ కటాక్షాలతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలన్నారు.