తూ. గోదావరిలో ఫ్రెండ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
NEWS Sep 07,2024 11:44 am
తూ.గో. జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్, పల్నాడు జిల్లాకు చెందిన కార్తిక్ రాజమండ్రిలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. సెమిస్టర్ పరీక్షలకు చదువుకునేందుకు ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు గుండెలో నొప్పిరావడంతో అందరూ కలిసి రాజమండ్రిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరగా యాక్సిడెంట్ జరిగింది.