తునిలో పేదల ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగింది: యనమల
NEWS Sep 07,2024 11:45 am
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజవర్గ పరిధిలోని సేకరించిన భూములు, చెల్లించిన సొమ్ము వివరాలను తనకు తెలియజేయాలన్నారు.