ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
NEWS Sep 07,2024 01:06 pm
గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ధవలేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం ఉదయం 10 గంటలకు 11.60 అడుగులకు చేరింది. 9,62,647 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది నీటిమట్టం తగ్గటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉదయం 8 గంటలకు ఉపసంహరించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో వరద తగ్గుముఖం పట్టడంతో క్రమేపి ధవళేశ్వరంలో కూడా తగ్గు ముఖం పట్టిందని అధికారులు తెలిపారు.