వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే
NEWS Sep 07,2024 01:07 pm
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కేసీ గుప్త జయంతిని పురస్కరించుకుని అమలాపురంలో ఆర్యవైశ్య సంఘం జర్నలిస్ట్ డే నిర్వహించారు. క్లబ్ గోల్డెన్ వనిత విభాగం క్లబ్ సభ్యురాలు యెండూరి సీత ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు రవితేజను ఘనంగా సత్కరించారు. సంఘం సభ్యులు సుధా, వరలక్ష్మి, పార్వతి పాల్గొన్నారు.