వరద బాధితులకు విద్యార్థుల సాయం
NEWS Sep 07,2024 01:13 pm
విజయవాడ వరద బాధితులకు అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన శ్రీరామ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సుమారు రూ.35 వేలతో ఆహారపదార్థాలను అందించారు. సదరు నగదుతో వాటర్ బాటిళ్లు, బిస్కెట్, రస్కు ప్యాకెట్లు శనివారం విజయవాడ తీసుకువెళ్లి బాధితులకు పంపిణీ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ గణేశ్, వైస్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.