అమలాపురం విత్తనాల వారి పాలెంలో శ్రీ బాలగణపతి స్వామి మండపంలో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.