బీజేపీ కార్యాలయంలో గణేశ్ పూజలు
NEWS Sep 07,2024 01:09 pm
రాజమండ్రి: వినాయక చవితి సందర్భంగా రాజమండ్రిలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జిల్లాధ్యక్షుడు బొమ్మలు దత్తు ఆధ్వర్యంలో వినాయకుడి ప్రతిమ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీదేవి, ఏసు పాల్గొన్నారు.