పెద్ద చెరువుకు బుంగ.. మరమ్మత్తులు
NEWS Sep 07,2024 11:46 am
నారాయణఖేడ్ మండలం ర్యాకల్ పెద్ద చెరువుకు బుంగ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద చెరువులోకి సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. చెరువుకు బుంగపడడంతో నికరం వృధాగా పోతుంది. మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ సర్పంచి అంజయ్య గ్రామస్తులు బుంగ తాత్కాలికంగా మూసివేశారు. అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.