విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు గండ్లను అధికారులు పూడ్చివేశారు. భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు మూడు గండ్లు పడగా.. విజయవాడను వరద ముంచెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన జలవనరుల శాఖ అధికారులు బుడమేరు గండ్లను పూడ్చివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు. ఏజెన్సీల సాయంతో రెండు గండ్లను పూడ్చివేసిన అధికారులు.. మూడో గండిని పూడ్చేందుకు ఆర్మీ సాయం తీసుకున్నారు.