సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సిద్దిపేట మెదక్ రహదారి పక్కన అప్పుడే పుట్టిన మగ శిశువును ను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాముల వద్ద చెత్త కుప్పల్లో పడవేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.