జిల్లాలో వాహన డ్రైవర్లకు పోలీసుల కౌన్సిలింగ్
NEWS Sep 07,2024 11:48 am
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం మలక వేముల క్రాస్ వద్ద ఆటో డ్రైవర్లకు ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు శనివారం పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ శ్యాం రావు తన సిబ్బందితో
కలిసి వెళ్లి డ్రైవర్లను పిలిపించి మాట్లాడుతూ అధిక లోడు, వేగంతో వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి వాహనాలు ఫిట్నెస్ కలిగి ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.