కొండగట్టు అంజన్న హుండీ ఆదాయము రూ. 81.07లక్షలు
NEWS Sep 07,2024 11:39 am
కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 56 రోజులకు గాను 12 హుండీలను, కరీంనగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ పర్యవేక్షణలో శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వారిచే లెక్కించగా, హుండీ ఆదాయము రూ. 81,07,641నగదు, 14 గ్రాముల బంగారం, 4,900 గ్రాముల వెండి, 61 విదేశీ కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమములో ఆలయ అధికారులు, అర్చకులు, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.