బత్తలపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా
NEWS Sep 07,2024 11:51 am
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం కదిరి వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో బస్సు కండక్టర్ రాజశేఖర్, మంగమ్మ మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్లో బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు. ఎస్సై శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.