బూర్జ మండలం పనుకుపర్తలో వినాయక నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభించారు. తొమ్మిది రోజులు జరిపే ఈ ఉత్సవాలు స్థానిక రామాలయం వద్ద ఉన్న నటరాజ్ కళావేదికలో గణనాధుడు పూజలు అందుకుంటున్నాడు. గ్రామ పురోహితులు శ్రీ రంపా శ్రీనివాస శర్మ బొజ్జ గణపయ్యకు పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు అత్యంత సుందరంగా మండపాన్ని తీర్చిదిద్దారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.