వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శివాలయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహణ చేపట్టారు. ఆలయ ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో క్షేత్రంలోని శివాలయంలో మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వినాయకుడికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీగుళ్ల విద్యాసాగర్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.