ఏపీలోని జిల్లాలకు నిధులు విడుదల
NEWS Sep 07,2024 07:08 am
వరద సహాయ చర్యల కోసం 6 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం రూ. 67 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాకు రూ. 50 కోట్లు, కృష్ణాకు రూ. 5 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ. 2 కోట్లు, పల్నాడుకు రూ. 4 కోట్లు, గుంటూరుకు రూ. 2 కోట్లు, ఏలూరుకు రూ. 3 కోట్లు, తూ.గో జిల్లాకు రూ. కోటి చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు.