మట్టి విగ్రహాలనే పూజిద్దాం
NEWS Sep 07,2024 01:11 pm
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కోసం, సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తిలో కూడా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి విగ్రహాలనే పూజించాలని ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని-రవి అన్నారు. ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో 59వ డివిజన్ జ్యోతినగర్‌లోని వెంకటేశ్వర ఆలయంతో పాటు డివిజన్లో పలుచోట్ల మట్టి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు.