శ్రీ సత్యసాయి: జాతీయ పోషక ఆహార మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికీ పోషకాహారం అందించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో ఏడవ రాష్ట్రీయ పోషన్ గోడపత్రికలను విడుదల చేశారు. కార్యక్రమంలో మహిళా అభివృద్ధి అధికారి నాగమల్లేశ్వరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.