హౌరా నుంచి పుట్టపర్తి వరకు నడిచే హౌరా ఎక్స్ ప్రెస్ రైలును (వారానికి ఒక రోజు నడిచే)ను ఈ నెల 25 నుంచి యశ్వంత్ పూర్ వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని రైల్వే అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ రైలు హిందూపురం రైల్వే స్టేషన్ లో ఆగుతుందని చెప్పారు. ప్రతి గురువారం సాయంత్రం హిందూపురం చేరుకుంటుందని తెలిపారు.