మెగా డాటర్ మీద ట్రోలింగ్
NEWS Sep 07,2024 06:16 am
నిహారిక కొణిదెల ఏపీ ప్రభుత్వానికి చేసిన సాయం మీద విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. తెలంగాణ ఏం అన్యాయం చేసింది? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు కొందరు. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి ఆర్థిక విరాళాన్ని ప్రకటిస్తున్నారు. అశ్వనీదత్ ముందుగా ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే విరాళాన్ని ప్రకటించాడు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా విరాళం ప్రకటించారు.