ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు. 70 ఏళ్ల నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు దర్శించుకోనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.