కర్నూలు: ఎమ్మిగనూరులో గణపయ్య ఉగ్ర నరసింహ రూపంలో కొలువు దీరాడు. శ్రీశైలం, అరుణాచలం, కాశి నుండి 70 కేజీలు రుద్రాక్షల సేకరించి సుమారు 41 ఒక్క రోజుల పాటు శ్రమించి 20 అడుగుల ఎత్తుతో శ్రీ ఉగ్రనరసింహ స్వామి అవతారంలో మట్టి వినాయకుణ్ణి తయారు చేసారు. స్థానిక కొండవీటి ప్రాంతంలో శ్రీ బాలవినాయక యువక మండలి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుతూ 33 ఏళ్ల నుండి మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.