మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
NEWS Sep 07,2024 05:29 am
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని స్థానిక మూడో వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వార్డులో ప్రజలకు మట్టి వినాయక విగ్రహలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కళా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణం గాని నీళ్లు కలుషితం కాకుండా ఉంటుందని, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరారు.