మంత్రితో వైసీపీ సర్పంచుల భేటీ
NEWS Sep 07,2024 06:25 am
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంకు చెందిన వైసిపి సర్పంచులు మంత్రి సవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీలకు సంబంధించిన నిధులు మంజూరు చేయాలని మంత్రిని కలిసి విన్నవించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, సర్పంచుల నిధులను పక్కదారి పట్టించిందని పంచాయతీలకు రావాల్సిన నిధులు నేరుగా పంచాయతీలకే ఇస్తామని తెలిపారు.