ఎల్లంపల్లి ప్రాజెక్టుకి తగ్గిన వరద ఉదృతి
NEWS Sep 07,2024 03:14 am
ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద ఉదృతి తగ్గింది. కడెం ప్రాజెక్ట్ నుంచి 4వేలు, ఎగువ ప్రాంతాల నుంచి 12వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20. 175 టీఎంసీలకు గాను, 19. 210 టీఎంసీల నీరు ఉంది. ఇన్ ఫ్లోగా 16 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 302 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. వరద ఉదృతి లేకపోవడంతో గేట్లు మూసివేశారు.