సత్యసాయి జిల్లా నుంచి ఆహార పదార్థాలు
NEWS Sep 07,2024 03:15 am
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి విజయవాడలోని వరద బాధితుల కోసం నిత్యవసర వస్తువులు తరలించారని కలెక్టర్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 34,800 పాల ప్యాకెట్లతో పాటు ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్త రలించినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలందరు వరద బాధితుల సహాయార్థం ముందుకు రావాలని తెలిపారు.