గణపతి పూజ చాలా మహిమాన్వితమైనదని సకల శుభాలను ప్రసాదించేదని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.నరేందర్ రెడ్డి కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వేద బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య పండుగ వాతావారణాన్ని తలపించే విధంగా వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు. ముందస్తు వినాయకచవితి ఉత్సవ్ ను శాస్త్రోత్తంగా వేదమంత్రాలతో జ్యోతిప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలలో వినాయచవితికి ప్రత్యేకత ఉందని తెలిపారు.