రేవంత్ - మహేష్ నేతృత్వంలో కాంగ్రెస్ బలోపేతం
NEWS Sep 06,2024 06:19 pm
సీఎం రేవంత్ రెడ్డి, నూతనంగా పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ వెలిచాల ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హై కమాండ్ నియమించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఎన్ ఎస్ యు ఐ నుంచి చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడిగా నియమితులు కావడం అభినందనీయమని పేర్కొన్నారు.