టైం ఇవ్వకుండా భవనం కూల్చడం దారుణం
NEWS Sep 06,2024 06:11 pm
సిరిసిల్లలో ప్రజాప్రతినిధిగా ఉన్న మంచే శ్రీనివాస్ భవనాన్ని కూల్చే ముందు కనీసం టైం ఇవ్వకుండా ఎలా కూలుస్తారని బిఆర్ఎస్ సిరిసిల్ల కౌన్సిలర్ దార్ల సందీప్ ప్రశ్నించారు. నిన్నటి రోజు బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ఫిర్యాదుతో, హైకోర్ట్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని మునిసిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ భవనం సెల్లార్లను కూల్చిన మునిసిపల్ అధికారుల తీరును తప్పు పడుతూ, బిఆర్ఎస్ కౌన్సిల్లర్ లు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.