మాజీ జడ్పీటీసీని పరామర్శించిన మాజీ మంత్రి
NEWS Sep 06,2024 06:11 pm
సోన్ మండల మాజీ జడ్పీటీసీ జీవన్ రెడ్డి గత కొన్నిరోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి మాజీ జడ్పీటీసీని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.