మట్టి వినాయకుల ప్రాధాన్యతను తెలిపిన విద్యార్థులు
NEWS Sep 06,2024 06:14 pm
సిరిసిల్ల అర్బన్ పెద్దూర్ ఎంపీహెచ్ఎస్ పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మట్టితో గణపతులను తయారు చేశారు. పర్యావరణహితమైన మట్టి గణపతులనే ఉపయోగించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ విగ్రహాలు ఉపయోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని సందేశాన్ని తెలిపారు. విద్యార్థులను ప్రేరేపించడానికి ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రవర్తుల రమాదేవి అభినందించారు. ఈ మట్టి గణపతిల తయారీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.