టీ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ నియామకం పట్ల హర్షం
NEWS Sep 06,2024 06:15 pm
అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియమించడంతో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకట స్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.