బాల్య వివాహలను అరికట్టాలి
NEWS Sep 06,2024 06:20 pm
అనంతగిరి మండలంలోని కొండిబ గ్రామ సచివాలయ కేంద్రంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కొర్ర దామోదర్ అంగన్వాడీ సూపర్వైజర్ సత్యవతి అంగన్వాడి సిబ్బంది ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన కొరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయం కార్యదర్శి మాట్లాడుతూ బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.