రామాయపల్లిలో పోషణ్ మాసోత్సవాలు
NEWS Sep 06,2024 06:21 pm
మనోహరాబాద్ మండలం రామాయపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ్ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ మెహతా బేగం ఆధ్వర్యంలో గర్భిణీలు బాలింతలకు పోషకాహారం పై అవగాహన కల్పించారు. గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. జిఎంఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ, ప్రతినిధి శ్రీనివాస్, రామకృష్ణ, టీచర్ సునీత, ఆశా వర్కర్ పద్మ పాల్గొన్నారు.